భగవద్గీత
భక్తుడైన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ రూపమున శ్రీమన్నారాయణుడే స్వయముగా భగవద్గీతను భోధించినాడు. పురాణమునియైన వేదవ్యాస భగవానుడు ఆశువుగా ప్రవచించగా విఘ్నేశ్వరుడు మహాభారత మధ్య భాగమైన భీష్మపర్వంలో భగవద్గీతను పొందుపరచినాడు.
భగవద్గీత ఎవరికి అవసరం?
కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికి
తన భవిష్యత్తు గురించి కలలుగనే ప్రతి ఒక్కరికి
తాను నిర్ణయించుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి
నిజమైన సుఖం అంటే ఏమిటి తెలుసుకొని ఆనంధించాలనుకునే ప్రతి ఒక్కరికి
మానవుని పుట్టుక, మరణానికి కారణం తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి